బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌కి షూటింగ్లో ప్రమాదం జరిగింది. పెను ప్రమాదం తప్పిందని సినీ వర్గాలల్లో టాక్. స్వల్ప గాయాలతో బయటపడ్డారాయన. అక్కీ ప్రస్తుతం టైగర్ ష్రాఫ్‌తో కలిసి బడే మియాన్ చోటే మియాన్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
అలీ అబ్బాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మూవీకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను స్కాట్లాండ్లో చిత్రీకరిస్తున్నారు. ట్రైగర్ ష్రాఫ్‌తో కలిసి అక్షయ్ కుమార్ స్ట్టంట్స్ చేస్తుండగా ఈ సీనియర్ హీరోకి గాయాలయ్యాయి. గాయమైన వెంటనే చిత్ర యూనిట్ కంగారు పడింది.
వెంటనే షూటింగ్‌ను ఆపేశారు కూడా. ఈ వెర్సటైల్ హీరో కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత షూటింగ్‌ను కొనసాగించారు.గాయమైందనే విషయాన్ని బయటకు తెలియనీయకుండా క్లోజప్ షాట్స్‌తో సన్నివేశాల్లో నటించారు అక్షయ్ కుమార్. అలయ, జాన్వీ కపూర్, మానుషి చిల్లర్ తదితరులు ఇతర పాత్రల్లో అలరించబోతున్నారు.
సాధారణంగా అక్షయ్ కుమార్ యాక్షన్న సన్నివేశాల్లో డూప్‌ను ఉపయోగించరు. ఆయనే స్వయంగా యాక్షన్ సీన్స్‌లో నటిస్తారు. ఈ సినిమాలోనూ అలాగే నటించారు. ఆ సమయంలోనే మోకాలికి గాయమైంది. అయితే ఆ గాయం పెద్దది కాకపోవటంతో అక్షయ్ షూటింగ్‌ను పూర్తి చేశారు.
రోబో సీక్వెల్ 2.0లో నటించటం ద్వారా దక్షిణాది ప్రేక్షకులకు ఆయన దగ్గరయ్యారు. ఇప్పుడు బడే మియాన్ చోటే మియాన్ సినిమాను కూడా హిందీతో పాటు దక్షిణాదిన కూడా విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.