రిస్క్ తో కూడిన స్టంట్స్ హీరో విశాల్ కు తీవ్ర గాయాలు..

విశాల్
విశాల్

హీరో విశాల్ (Vishal)తరచుగా గాయాల బారిన పడుతున్నారు. ప్రమాదకరమైన స్టంట్స్ లో ఆయన స్వయంగా పాల్గొనడం ప్రమాదాలకు కారణమవుతుంది. సాధారణంగా హీరోలు రిస్క్ తో కూడిన స్టంట్స్ చేసేటప్పుడు డూప్స్ తో లాగించేస్తారు. విశాల్ మాత్రం దీనికి విరుద్ధం. ఎంత రిస్కీ షాట్ అయినా స్వయంగా చేయడానికి మొగ్గుచూపుతారు. ఈ క్రమంలో విశాల్ కి గాయాలు అవుతున్నాయి. ఇటీవల ఆయన చేతి వేళ్ళకు గాయమైంది. కేరళలో వైద్యం చేయించుకొని తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నారు.

కాగా నేడు మరలా విశాల్ ప్రమాదానికి గురయ్యారు. లాఠీ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. విశాల్ పై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఓ రిస్కీ స్టంట్ చేస్తూ విశాల్ అదుపుతప్పి క్రిందపడ్డారు. ఈ ప్రమాదంలో విశాల్ కి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వెంటనే ఆయన్ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. విశాల్ కి ప్రమాదం జరిగిన నేపథ్యంలో షూటింగ్ నిలిపివేశారు. ఆయన తిరిగి కోలుకున్న తర్వాత తిరిగి ప్రారంభించనున్నారు.