సోదరి పై అన్న అత్యాచారం.. ఫోక్సో చట్టం కింద కేసు..

మానవతా విలువలు రోజురోజుకు చచ్చిపోతున్నాయి. వావివరస మర్చిపోయి మనుషులు మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.కరోనా ప్రభావం, లాక్ డౌన్ కాలంలో అంతా ఇంటికే పరిమితం కావడంతో క్రైమ్ రేట్ తగ్గిపోయింది. పొల్యూషన్ కూడా తగ్గిపోయి వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి. అయితే.. అక్కడక్కడా మాత్రం చిన్న చిన్న క్రైమ్ జరుగుతూనే ఉన్నాయి.మానసిక ఒత్తిడిలకు గురి అవుతున్నవారు అనేక మంది కూడా ఉన్నారు.

తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఓ దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని పాతపట్నం మండలంలోని ఓ గ్రామంలో నివసించే బాలికపై చిన్నాన్న కొడుకు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మే 13 వతేదీన జరిగింది. బాధితురాలి తండ్రి పనికి వెళ్లడంతో.. అది గమనించిన పక్కింట్లో ఉండే చిన్నాన్న కొడుకు పరమేశ్ బాధితురాలి పై అత్యాచారం చేశాడు. దీంతో తండ్రి ఇంటికి వచ్చిన వెంటనే బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో వెంటనే తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. నిందితుడిని అరెస్ట్ చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కూడా వెంటనే స్పందించి దర్యాప్తు జరుపుతున్నారు.