ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ తాజా ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో ఆద్యంతం కామెడీ, డ్యాన్స్‌లతో సాఫీగా సాగిపోతుండగా.. షో మధ్యలో సడెన్‌గా పోలీసులు సీరియస్ ఎంట్రీ ఇచ్చి ఫైర్ అయ్యారు.
షూటింగ్‌కు వచ్చే ముందు ఆది కారుతో యాక్సిడెంట్ చేసి వచ్చాడని, బాధితుడు చావు బతుకుల మధ్య ఉన్నాడని చెప్పారు. దీంతో సెట్లోని వారంతా షాక్ అయ్యారు. పోలీసులతో ఆటో రామ్ ప్రసాద్, మిగతా వాళ్లు మాట్లాడటానికి ట్రై చేస్తున్నా.. అధికారులు వినకుండా కెమెరా ఆపాలంటూ ఫైర్ అయ్యారు.
అయితే ఇదంతా ప్రమోషన్స్ కోసమేనని ఇలా చెయ్యడం కొత్తేమి కాదు ప్రేక్షకులని ఆకట్టుకోడానికే ఇవన్నీ అని నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు