ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి సంబరాల్లో జరిపిన కాల్పుల్లో ఓ పదేళ్ల బాలిక మరణించింది. ఫరిదాపూర్‌లోని న్యూ కాలనీలో శుక్రవారం రాత్రి ఓ పెళ్లి జరిగింది. పెళ్లికి సంబంధించి వధూవరుల్లో ఓ వైపు వారు షాజహాన్‌పూర్ నుంచి వచ్చారు. ఆ సమయంలో జరిగిన వేడుకల్లో కొందరు వ్యక్తులు తాగిన మైకంలో కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ మాన్సి అనే బాలికకు తగిలింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. బాలిక పెళ్లి కూతురుకు సోదరి అవుతుందని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.