తెలంగాణలో పదో తరగతి పరీక్షా సమయం 30 నిమిషాలు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మాదిరిగానే పరీక్షా సమయం పొడిగించారు. 2 గంటల 45 నిమిషాలు ఉన్న పరీక్ష సమయాన్ని 3 గంటల 15 నిమిషాలకు పొడిగించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
5 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. 70 శాతం సిలబస్‌నే అమలు చేస్తున్నామన్నారు. ప్రశ్నపత్రంలో అధిక చాయిస్ ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు.