హీరో నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల పెళ్లి పీటలెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. రీసెంట్ గానే వీళ్ళ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, తాజాగా వీళ్ళ పెళ్లి పనులు కూడా మొదలు అయ్యాయి. పసుపు దంచుతున్న ఫొటోలని శోభితా తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో, ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
శోభితా ధూళిపాళ్ల ఈ పిక్స్ ని షేర్ చేస్తూ.. ‘గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయి’ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఎరుపు రంగు, గోధుమ వర్ణం పట్టు చీరలో శోభితా ధూళిపాళ్ల మెరిసిపోతూ కనిపించడం నెటిజన్లని ఆకట్టుకుంది. పెళ్లి ఎక్కడ, ఎప్పుడో చెప్పాలని నెటిజన్లు వరుసగా పోస్ట్ లు పెడుతూనే ఉన్నారు . ఇక, మూవీ ల విషయానికి వస్తే.. శోభిత ధూళిపాళ్ల 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా కూడా నిలిచారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటున్నారు.