అసలే.. కరోనా.. ప్రపంచదేశాలన్ని కరోనాతో అల్లల్లాడి పోతున్నాయి. లాక్ డౌన్ తో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అలాంటి సమయంలో ఓ దేశానికి చెందిన రాజు అవేం పట్టించుకోకుండా తనకున్న 15మంది రాణులతో రాయల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఉన్నతమైన జీవితాన్ని గడుపుతూ భార్యల కోసమే ప్రభుత్వ ఖజానాని ఖాలీ చేసేస్తున్నాడు. అదేంటే చూద్దాం.
ముఖ్యంగా ఆఫ్రికా దేశంలో ఆకలి కేకలు విపరీతంగా ఉంటాయి. అసలే చీకటి ఖండం. ఆర్ధికంగా వెనకబడిన దేశాలు అధికంగా ఉన్న ఖండం. వనరులు ఉన్నప్పటికీ వాటిని సమర్ధవంతంగా వినియోగించుకోలేని దేశాలు ఆ ఖండంలో ఎక్కువగా ఉన్నాయి. అందుకే అక్కడి ప్రజలు తీవ్రంగా ఆకలితో కొట్టుమిట్టాడుతుంటారు. ఆకలితో ప్రజలు అలమటిస్తుంటే.. న్యూజిలాండ్ దేశానికి చెందిన రాజు మాత్రం భార్యలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఏకంగా తన 15 మంది భార్యల కోసం రూ.175 కోట్ల రూపాయలతో 19 రోల్స్ రాయిస్ కార్లను కొన్నాడు. స్వాజిలాండ్ దేశాన్ని పాలిస్తున్న రాజు మస్వతి III.