ఓటమి పాలయిన 16 మంది కాంగ్రెస్ మంత్రులు !

16 Congress Ministers lost in Karnataka election 2018
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అధికారపార్టీ అయిన కాంగ్రెస్‌కు చెందిన 16 మంది మంత్రులు ఓటమిపాలవడం కాంగ్రెస్ నేతలకి మింగుడు పడడంలేదు. ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఈసారి రెండు నియోజక వర్గాల్లో పోటీ చేశారు. స్వయంగా సిద్దరామయ్యే చాముండేశ్వరిలో ఓటమి చెందగా, బాదామిలో విజయం సాధించారు.  అయితే ఇదే విషయం మీద బీజేపీ కాంగ్రెస్ ని ఎద్దేవా చేస్తోంది.
ఇప్పటివరకు వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పది మంది సిట్టింగ్ మంత్రులు ఓటమి పాలయ్యారని,  ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతటి వ్యతిరేకత ఉందో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనమని పేర్కొంది. ప్రజలను విభజించి ఓట్లు దండుకునే కుయుక్తులకు కాంగ్రెస్ పాల్పడటం, ప్రభుత్వ పని తీరు అసమర్థంగా ఉండటంతో ఓటర్లు ఆ పార్టీని తిరస్కరించారని విమర్శించారు.