సమాజం సిగ్గుపడే ఘటన

సమాజం సిగ్గుపడే ఘటన

వనపర్తి జిల్లాలో సభ్య సమాజం సిగ్గుపడే ఘటన చోటుచేసుకుంది. కామంతో కళ్లుమూసుకుపోయిన యువకుడు పదేళ్ల బాలుడిని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని ఓ గ్రామంలో గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం జరగ్గా బాలుడి తల్లి గురువారం రాత్రి పోలీసులను ఆశ్రయించింది.గ్రామానికి చెందిన సహదేవుడు అనే యువకుడు జులాయిగా తిరుగుతుంటాడు.

బుధవారం సాయంత్రం గ్రామంలోని ఓ చోట ఆడుకుంటున్న బాలుడిపై అతడి కన్నుపడింది. బాలుడి వద్దకు వెళ్లిన సహదేవుడు మాయమాటలు చెప్పి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ లైంగిక దాడికి యత్నించగా బాలుడు కేకలు పెట్టాడు. దీంతో అతడి నోరు నొక్కేసి అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. అనంతకం ఏడుస్తూ ఇంటికెళ్లిన బాలుడు జరిగిన విషయాన్ని తల్లికి చెప్పాడు. ఆమె కుటుంబ సభ్యులతో చర్చించి గురువారం పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు సహదేవుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.