‘గేమ్ ఛేంజర్’ లో ప్రత్యేక పాటకే 20 కోట్లా?

20 crores for a special song in 'Game Changer'?
20 crores for a special song in 'Game Changer'?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ మూవీ కోసం అభిమానులు ఏంటో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మూవీ నుంచి ఆల్రెడీ వచ్చిన రెండు సాంగ్స్ మంచి చార్ట్ బస్టర్ అయ్యాయి.

20 crores for a special song in 'Game Changer'?
20 crores for a special song in ‘Game Changer’?

శంకర్ మూవీ ల్లో సాంగ్స్ అంటే ఎంత స్పెషల్ ఎంత భారీతనం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే గేమ్ ఛేంజర్ లో కూడా సాంగ్స్ కోసం కోట్ల డబ్బు మంచి నీళ్లలా ఖర్చు చేసినట్టు ఆ మధ్య నిర్మాత దిల్ రాజే తెలిపారు. ఇక ఇపుడు నెక్స్ట్ రానున్న సాంగ్ కోసం బజ్ ఏంటో తెలుస్తుంది.

దీనితో ఈ రానున్న మూడో సాంగ్ అది కూడా మెలోడికి ఏకంగా మేకర్స్ 20 కోట్లు వెచ్చించినట్టుగా రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి. దీనితో ఈ సాంగ్ విజువల్స్ ఏ లెవెల్లో ఉండనున్నాయో అనేది అర్ధం చేసుకోవచ్చు. థమన్ అందించిన ఈ సాంగ్ ఈ అక్టోబర్ చివరిలో రానున్నది . అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మూవీ విడుదల కాబోతుంది.