Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2017ను బాహుబలి నామ సంవత్సరంగా చెప్పొచ్చు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎక్కువమంది చర్చించింది ఈ సినిమా గురించే. ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ తో పాటు సోషల్ వెబ్ సైట్లు ఫేస్ బుక్, ట్విట్టర్ లోనూ ఎక్కువమంది బాహుబలి 2 గురించే మాట్లాడుకున్నారు. ఏటా ఈ మూడు వెబ్ సైట్లు టాప్ ట్రెండ్స్ లిస్ట్ ను రిలీజ్ చేస్తాయి. అలా ఈ ఏడాదీ విడుదల చేసిన జాబితాలో బాహుబలి 2 తొలిస్థానంలో నిలిచింది. గూగుల్ జాబితాలో బాహుబలి 2, ఐపీఎల్, లైవ్ క్రికెట్ స్కోర్, దంగల్, హాప్ గర్ల్ ఫ్రెండ్, బ్రదినాథ్ కి దుల్హనియా, మున్నా మైఖేల్, జగ్గా జాసూస్, చాంపియన్స్ ట్రోఫీ, రయీస్ తొలి పదిస్థానాల్లో నిలిచాయి. ట్విట్టర్ లో తొలి మూడు స్థానాల్లో బాహుబలి 2, బిగ్ బాస్ 11, మెర్సల్ ఉన్నాయి.
ఫేస్ బుక్ లో ఎక్కుమంది చర్చించిన వాటిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. బాహుబలి 2, జై లవకుశ గురించి ఎక్కుమంది చర్చించారు. ఫేస్ బుక్ విడుదల చేసిన ట్రెండ్స్ లిస్ట్ లో బాహుబలి 2, జల్లికట్టు,చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా-పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్, సూపర్ ఫాస్ట్ రైళ్లు, బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా మరణం, లింకిన్ పార్క్ గాయకుడు చెస్టర్ బెన్నింగ్ టన్ మరణం, జైలవకుశ, యోగి ఆదిత్యనాథ్, ప్రపంచ సుందరి మానుషి చిల్లర్, గోరఖ్ పూర్ ఆస్పత్రిలో చిన్నారుల మృతి తొలి పదిస్థానాల్లో ఉన్నాయి. మొత్తానికి బాహుబలి అంతర్జాతీయ రికార్డులను కొల్లగొట్టడమే కాకుండా నెట్టింట్లోనూ చరిత్ర సృష్టించింది.