అక్రమ రవాణా చేస్తున్న 26 టన్నులు గోమాంసం……

ఆంధ్రప్రదేశ్ లో అక్రమంగా తరలిస్తున్న గోమాంసాన్ని పోలీసులు పట్టుకున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పోలీసులు 26టన్నుల గోమాంసం తరలిస్తున్న కంటైనర్ ను గుర్తించారు. అయితే ఆ కంటైనర్లో ఏకంగా 20కిలోల గోమాసం బస్తాలు 1300 ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

అయితే ముందుగా గోమాంసం తరలిస్తున్నట్టు ఒడిస్సా రాష్ట్రంలోని బరంపురంలోని భజరంగ్దళ్ సభ్యులకు సమాచారం అందింది. దాంతో వారు ఇచ్చాపురం సీఐ వినోద్ బాబుకు సమాచారాన్ని చేరవేశారు. అలాగే.. ఆ సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు పురుషోత్తపురం చెక్ పోస్ట్ వద్ద కంటైనర్ ను అడ్డుకున్నారు. అక్కడే ఆ కంటైనర్ ను నిలిపివేసిన అధికారులు చెక్ చేశారు. దీంతో ఆ కంటైనర్ లో ఉన్న గోమాంసం విలువ మొత్తం రూ.10.40 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కాగా కంటైనర్ లో ఉన్న డ్రైవర్ ను..మిగతా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.