జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి కాణిపాకం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో రెండేళ్ల చిన్నారి, ఓ మహిళ ఉన్నారు.