పెద్ద పులికి కోలుకోలేని దెబ్బ.. మరో 4 పులులకు కరోనా లక్షణాలు

కోవిద్-19 కరోనా విశ్వాన్ని వణికించేస్తుంది. ఈ కరోనా బారిన మనవాళి మాత్రమే కాకుండా జంతువులు కూడా పడుతున్నాయి. న్యూయార్క్‌లోని బ్రాంక్జ్‌ జూలో నాలుగేళ్ల మలయన్‌ పులి నాదియా(పెద్ద పులి)కి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కరోనా బారిన పడిన తొలి జంతువుగా నాదియాను జూ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ పశువైద్యుడు పాల్‌కాలే తాజాగా ప్రకటించారు. అయితే జూలోని మరో 6 పెద్ద పులులు కూడా పొడి దగ్గుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వాటికి రోగనిరోధక శక్తి మందులు ఇస్తున్నామని.. ప్రస్తుతం వాటి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

కాగా ఈ విషయంపై తాజాగా పాల్ కాలే మాట్లాడుతూ.. ‘ఈ పులులను చూసుకొనే సంరక్షకుల ద్వారా కొద్ది మోతాదులో టీఎల్‌సీ, కొన్ని రోగనిరోధక మందులు ఇస్తున్నాం. ప్రస్తుతం ఆ పులుల ఆరోగ్యం మెరుగుపుడుతోంది. అంతేగాక స్వల్ప అనారోగ్యంతో ఉన్న జూలోని మరో 4పులులకు, 3 సింహాలకు కూడా రోగ నిరోధక ఔషధాలు ఇస్తున్నాం’ అని అన్నారు. అయితే ‘నాదియా మార్చి మధ్యలో అనారోగ్యం బారిన పడింది. మార్చి 27 నుంచి కరోనా లక్షణాలు దానిలో కనిపించడంతో కోవిడ్‌-19 పరీక్షలు చేయిస్తున్నరు. అందుకోసం నాదియా కాలేయం, ముక్కు, గొంతుకు సంబంధించిన శ్వాసనాళాల నుంచి వచ్చే కార్నెల్‌లను పరీక్షల నిమిత్తం న్యూయార్క్‌ పశువైద్యశాల యూనివర్శిటీకి పంపించారు. ఆ పరీక్షల్లో నాదియాకు కోవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చింది.

అంతేకాకుండా ప్రస్తుతం దానినిను ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నాదియా ఇప్పుడు ఆహారం తీసుకోవడం పూర్తిగా మానేసిందని పాల్‌కాలే వివరించారు. అయితే కరోనా వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకే అవకాశం లేదని కూడా ఆయన చెప్పడం విశేషం. హాంకాంగ్‌లోని కొన్ని జంతువులు అనారోగ్యంతో బాధపడుతున్నాయని.. వాటికి కూడా కరోనా పరీక్షలు జరిగాయని స్పష్టం చేశారు.