గురుగ్రామ్ లో ఓ కుటుంబంపై దాడి.. కరోనా వల్లే

కరోనా వైరస్ కారణంగా సమాజంలో గొడవలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో దాడులు చోటు చేసుకున్నాయి. గురుగ్రాంలో తాజాగా న్యూ కాలనీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మనోహర్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న ముస్లిం కుటుంబంపై కొంతమంది దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బాధితుడి కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు కూడా గాయపడ్డారు. అలాగే.. గురుగ్రామ్‌లోని ఒక మసీదుపై కాల్పులు కూడా జరిగాయి.

కాగా దేశవ్యాప్తంగా ప్రజలకు పీఎం మోడీ ప్రజలకు కొవ్వొత్తులు, దీపాలను వెలిగించి ఐకమత్యాన్ని చాటుకొనేలా సంఘీభావం తెలిపారు. కానీ కొంతమంది దుర్మార్గుల ముఠా మాత్రం ఒక కుటుంబ జంటపై వారి చిన్న పిల్లలపై ఇటుకలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడితో కుటుంబం మొత్తం నివ్వెరపోయింది. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు ఆ సంఘ వ్యతిరేక శక్తులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి, మార్కాజ్ నుంచి కరోనా పాజిటివ్  ఉన్న ముస్లింలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిని ఆశ్రయించే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే గురుగ్రామ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల వాంగ్మూలం తీసుకొని కేసును నమోదు చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై సెక్షన్ 147,148, 323, 506, 452 కింద కేసు నమోదైంది