పంద్రాగస్ట్ సందర్భగా గుర్తొచ్చే 5 అంశాలు…

things to remember on the occasion of August 15
things to remember on the occasion of August 15

ఆగస్టు 15.. ఈ రోజు ప్రతి భారతీయుడికి పండుగే. దేశంలో హిందువులు దీపావళి, దసరా, వినాయక చవితి జరుపుకుంటారు. ముస్లింలు రంజాన్, బక్రీద్, మొహరం పండుగలు చేసుకుంటారు. క్రిస్టియన్లు క్రిస్మస్, గుడ్ ఫ్రైడే ప్రముఖంగా జరుపుకుంటారు. కానీ దేశం మొత్తం జరుగుపుకునే పండుగ మాత్రం స్వాతంత్ర్య దినోత్సవం.బ్రిటీష్ సంకెళ్లను తెంచుకుని భారత మాత స్వేచ్ఛా గాలిని పీల్చింది ఈ రోజే.. సుదీర్ఘ బానిసత్వం తర్వాత, బ్రిటీష్ సంకెళ్లను తెంచుకుని వాటికీ ముగింపు పలుకుతూ భారత దేశ చరిత్రలో కొత్త శకానికి నాంది పలికింది.

బ్రిటిష్ వలస పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం పొందిన గుర్తుగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. దాదాపు 200 సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని బానిసత్వానికి గురి చేసిన బ్రిటిష్ వారి ఆధిపత్యం ముగిసిన రోజు ప్రాముఖ్యతే ఈ పండుగ. స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ రాజకీయ పార్టీ అయిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1930 జనవరి 26లోనే సంపూర్ణ స్వాతంత్య్రాన్ని కోరింది. ఈ తేదీ మెల్లగా గణతంత్ర దినోత్సవంగా ఆ వతరించగా, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినంగా ఆవిర్భవించింది. ఆ రెండు రోజులు భారతదేశానికి జాతీయ సెలవులుగా నిర్ణయించబడ్డాయి. .

1. స్వాతంత్ర్య దినోత్సవం చరిత్ర:

భారతదేశపు మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ గారు ఆగష్టు 15, 1947న ఢిల్లీలో ఎర్రకోటపై మన భారతదేశ జాతీయ జెండాను ఎగురవేసి ఆ క్షణం నుండే భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు, అనేక మంది నాయకులు చేసిన అవిశ్రాంత పోరాటం, అహింసా ప్రతిఘటన, త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చింది.

2. స్వాతంత్ర్య దినోత్సవం ప్రాముఖ్యత

స్వయం పాలన, సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం, కొత్త శకానికి ప్రతీకగా స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహిస్తారు. ఇందులో ప్రతి భారతీయుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఇది మన దేశ భవిష్యత్తు, భారతీయ ప్రజల యొక్క స్వేచ్ఛను సూచిస్తుంది.

3. ఆగస్టు 15న ఎందుకు జరుపుకుంటారు?

ఆగస్టు 15, 1947 భారత స్వాతంత్ర్య చట్టం అమలులోకి వచ్చిన తేదీ. ఈ చట్టం భారత ప్రజలచే ఎన్నుకోబడిన భారత రాజ్యాంగ సభకు శాసన సార్వభౌమాధికారాన్ని బదిలీ చేసింది. భారత స్వాతంత్ర్య చట్టం జూలై 18, 1947న బ్రిటీష్ పార్లమెంటుచే ఆమోదించబడింది. కొన్ని వందల సంవత్సరాల పోరాట ఫలితంగా దక్కిన ఫలితమే భారతావనికి బానిసత్వం నుండి స్వేచ్చని కల్పిస్తూ ఈ చట్టం వచ్చిన ఒక చారిత్రక ఘట్టం.

4. భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

స్వాతంత్ర్యదినం సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతాయి
ప్రతి పాఠశాలలో , ప్రభుత్వ ఆఫీసుల్లో , బహిరంగ ప్రదేశాలలో జాతీయ జెండాను అందరు కలిసి గౌరవప్రదంగా ఎగురవేస్తారు. ప్రజలు వారి సాంస్కృతిక కార్యక్రమాలు, కవాతులు ,ప్రజలు వారి వారి భిన్న సంప్రాదయ నృత్యాలు ప్రదర్శిస్తారు . ప్రధాన మంత్రి ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు, ప్రతి గ్రామం ,పల్లె పట్టణం ఎలా ప్రతి చోట జాతీయ జెండా స్వేచ్ఛగా ఎగురుతూ కనిపిస్తూ ఉంటుంది. చిన్న పిల్లలు పెద్దాలు ఎలా ప్రతి ఒకరు తమ పాఠశాల వద్ద ,కార్యాలయాల వద్ద వేడుకలు నిర్వహిస్తారు.

5. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భగా గుర్తొచ్చే కొన్ని అంశాలు

జెండా ఎరగవేయడం
విద్యార్థులు, రక్షణ దళాల పరేడ్
సాంస్కృతిక కార్యక్రమాలు
నేతలు, ప్రముఖల ప్రసంగాలు
స్వీట్లు, పండ్లు పంపిణీ
దీపాలు వెలిగించడం
దేశభక్తి గీతాలు ఆలపించడం
దేశభక్తి సినిమాలు చూడడం
కుటుంబం, స్నేహితులతో సమయం గడపడం
ప్రతి భారతీయుడికి స్వాతంత్ర్య దినోత్సవం ప్రత్యేకం. ఇది మన దేశం సాధించిన విజయాలకు గర్వించదగిన రోజు. మనమందరం ఈ రోజును ఆనందంగా గొప్పగా జరుపుకుందాం. మంచి భవిష్యత్తును నిర్మించడానికి కలిసి పని చేద్దాం.