బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఐదేళ్ల చిన్నారి

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఐదేళ్ల చిన్నారి

దృష్టి అనే ఐదేళ్ల చిన్నారి అప్పటి వరకు డ్యాన్సులు చేస్తూ చాలా సంబరంగా ఉండేది. ఇంట్లో నడియాడుతుంటే ఆ ఇంటికే కల వచ్చేది. ఇప్పుడు ఆ ఇంట్లో సందడి కనిపించడం లేదు. ఎందుకంటే చిన్నారి దృష్టి బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. అంతేకాదు చూపుకూడా పాక్షికంగా కోల్పోయింది.

2019లో తొలిసారిగా తనకు విపరీతమైన తలనొప్పి ఉందని , సరిగ్గా కళ్లు కనిపించడం లేదని తల్లి రీతూ మల్హోత్రతో చెప్పింది దృష్టి. వెంటనే ఆప్తమాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. ఎంఆర్ఐ స్కాన్ తీస్తే పాపకు ఉన్న సమస్య తెలుస్తుందని చెప్పారు డాక్టర్. స్కాన్ తీస్తే రీతూకు షాకిచ్చే వార్త చెప్పారు డాక్టర్లు. ఆమె మెదడులో 45 ఎంఎంల కణితి ఉందని చెప్పారు. ఇక పరీక్షలు జరిపే నాటికి చిన్నారి దృష్టి దాదాపుగా చూపు కోల్పోయింది.

తన చిన్నారి ఇంతా బాధకు గురవుతోందని అయినప్పటికీ ఇంతకాలం వరకు భరించిందని చెప్పుకుంటూ కన్నీరు మున్నీరైంది రీతూ.తాను డ్యాన్స్ చేస్తే చూసేందుకు రెండు కళ్లు చాలవని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పుడు మంచానికే పరిమితమైన తన కూతురును ఈ స్థితిలో చూడలేక ఉన్నానంటూ భోరున విలపించింది రీతూ. ప్రతిరోజు నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇప్పుడు పూర్తిగా కోలుకోవాలంటే చిన్నారి దృష్టికి రేడియో థెరపీ చేయాలని వైద్యులు సూచించారు. ఇంత చిన్న వయస్సులో అంత నొప్పిని, అంత బాధను తట్టుకునే శక్తిని భగవంతుడు దృష్టికి ఇచ్చాడనిపిస్తుందని తండ్రి కమల్ మల్హోత్ర చెప్పాడు.ఆమె నోరు తెరచి తమతో చెప్పనప్పటికీ లోపల ఆ బిడ్డ చెందుతున్న ఆవేదన తన కళ్లలో తెలుస్తోందంటూ ఆవేదన చెందారు.

దృష్టి తండ్రి కమల్ ఒక చిరుద్యోగి. ప్రతిరోజు గుర్గావ్ నుంచి తన ఆఫీసు ఉన్న ఢిల్లీకి వెళుతూ వస్తూ ఉంటాడు.రేడియో థెరపీకి ఖర్చు రూ.5 లక్షలు అవుతుంది. ఇప్పుడు ఆ పసిబిడ్డను మీరు మాత్రమే కాపాడగలరు. మీరిచ్చే విరాళం ద్వారా పసిబిడ్డ బతికి మళ్లీ ఆ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మంచి డ్యాన్సర్ కావాలన్న దృష్టి కోరికను నెరవేరుద్దాం. దృష్టి చికిత్సకు కావాల్సిన రూ. 5లక్షలు తోచినంతలో విరాళంగా ఇద్దాం.