56 గంటలపాటు తప్పిపోయిన చిన్నారి అడవిలో ఒంటరిగా..

కరోనా.. లాక్ డౌన్ కారణంగా జనారణ్యంలోకి పులులు, ఏనుగులు వస్తున్నాయి. దాంత జనం బెంబేలెత్తి పోతున్నారు. కానీ అలాంటిదానికే మనం అలా భయపడిపోతున్నామే.. ఇక అరణ్యంలోకి వెళ్లి అది పులులు ఇతర జంతువుల మధ్య ఇక అసలు బ్రతకగలమా? అదీ పగలూ రాత్రి తేడా లేకుండా అడవిలో ఉండటం వినడానికే భయాన్నికలిగిస్తొంది. కానీ.. నాలుగేళ్ల చిన్నారి 56 గంటల పాటు అడవిలో బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఎట్టకేలకు ఆ చిన్నారి మళ్లీ పెద్దల వద్దకు చేరువైంది. ఏమిటి ఆవైనం. అదేంటో తెలుసుకుందాం.

తాజాగా తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం మండలం దర్భలంకకు చెందిన చిన్నారి మంజూ తల్లితో కలిసి అడవి గుండా పెదమట్టపల్లి గ్రామం వస్తున్న సమయంలో అనుకోకుండా తప్పిపోయింది. అలా కనిపించకుండా పోయిన చిన్నారి కోసం ఆ తల్లి వెతకని స్థలం లేదు. అంతా ఓ మాయలా అలా తప్పిపోయింది. మార్కెట్ లో కొన్ని నిత్యవసర వస్తువులను తల్లి తరలిస్తున్న సమయంలో నాలుగేళ్ల చిన్నారి అడవి లోపలికి వెళ్లిపోవడంతో మంజు తల్లి కొద్ది సేపటికే గమనించి ఎంతో గాబరాకు లోనైంది. తల్లడిల్లిపోయింది. ఎంతో ఆవేదనకు లోనైంది. అలా రెండు రోజులు గడచిపోయాయి. ఎట్టకేలకు 56 గంటల తర్వాత ఆ చిన్నారి మళ్లీ కంటపడింది. కానీ ఆ పాపకు రేఖపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందించి ఇంటికి పంపించారు. కానీ.. ఇక్కడ మాయ ఏమిటంటే…. ఇన్ని గంటల పాటు నాలుగేళ్ల పాప అడవిలో ఎలా ఉంది అన్నది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.