ప్రముఖ టెలికామ్ దిగ్గజం భారతి ఎయిర్‌టెల్, ఎరిక్సన్‌తో కలిసి దేశంలో తొలిసారి గ్రామీణ ప్రాంతంలో 5జీ ట్రయల్స్ నిర్వహించింది. టెలికామ్ శాఖ ఎయిర్‌టెల్‌కు కేటాయించిన 5జీ ట్రయల్ స్పెక్ట్రమ్ ద్వారా దిల్లీ-ఎన్‌సీఆర్ శివార్లలోని భైపూర్ బ్రమనన్ గ్రామంలో ఈ ట్రయల్స్ జరిపాయి. డిజిటల్ అంతరాన్ని చెరిపేసి, డిజటలీకరణ ప్రక్రియను సంపూర్ణం చేసే సామర్థ్యం 5జీ నెట్‌వర్క్‌కు ఉందనే విషయం ఈ ప్రయోగాల్లో వెల్లడైందని ఇరు సంస్థలు వెల్లడించాయి.
“సైట్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న 3జీపీపీ-కంప్లైంట్ 5జీ ఎఫ్‌డబ్ల్యుఎ పరికరంలో 200కి పైగా ఎంబిపిఎస్ ఇంటర్నెట్ స్పీడ్ వచ్చినట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.భౌగోళికంగా మారుమూల ప్రాంతాల్లో కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ కవరేజీని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు” టెలికామ్ మేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. 3500మెగాహెర్ట్జ్ బ్యాండ్, ఇప్పటికే ఉన్న ఎఫ్‌డిడి స్పెక్ట్రమ్ బ్యాండ్ ద్వారా ఈ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయిల్స్‌లో భాగంగా ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్‌ను గుర్గావ్‌లోని సైబర్ హబ్ ప్రాంతంలో 3500 మెగా హెర్ట్జ్ మిడిల్ బ్యాండ్ స్పెక్ట్రంలో పరీక్షించింది.
ఎయిర్‌టెల్ టెలికమ్యూనికేషన్ విభాగం(డీఓటి) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ ట్రయిల్స్‌లో 1 జీబీపీఎస్ వేగానికి కంటే ఎక్కువ వేగాన్ని అందుకుంది. ఈ ఏడాది జనవరిలో ఎన్‌ఎస్‌ఏ (నాన్-స్టాండ్ అలోన్) నెట్‌వర్క్ టెక్నాలజీ ద్వారా 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో హైదరాబాద్ నగరంలో వాణిజ్య నెట్‌వర్క్ ద్వారా లైవ్ 5జీ సేవలను విజయవంతంగా పరీక్షించిన మొదటి టెల్కోగా ఎయిర్‌టెల్ నిలిచింది.