టీడీపీ షాక్….ఆరుగురు ఎమ్మెల్యేలకి టికెట్లు లేవు…!

6 TDP MLAs Not Contesting On Party Ticket
తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి. దీంతో ఏపీలో కూడా ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయారు జనం. ఇంకా ఎన్నికలకి ఎనిమిది నెలలు దాకా సమయం ఉన్నా చంద్రబాబు ఇప్పటి నుండే టికెట్ల సర్దుబాటు కార్యక్రమం మొదలు పెట్టేశారు. అలాగే ఏపీ మొత్తానికి ప్రభుత్వ ఏర్పాటును శాసించే పవర్ ఉన్న ఉభయ గోదావరి జిల్లాలలో బాబు పలువురు సీనియర్లను పక్కన పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సారి సుమారుగా ఆరుగురు ఎమ్మెల్యేలకు టిక్కెట్లు దక్కే అవకాశాలు లేదని తెలుస్తోంది. మరో ఇద్దరికి నియోజకవర్గాన్ని మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వారిలో ముందుగా కాకినాడ లోక్ సభ పరిధిలోని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు స్దానంలో ఆయన మనవడిని పోటీ చేయించాలని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దానికి కారణం సుబ్బారావుకు 75 ఏళ్ళు.
6-mlas
వయసును కారణంగా చూపి ఆయన సోదరుని మనవడు రాజాకి టిక్కెట్టిస్తారని సమాచారం. ఇక కాకినాడ రూరల్ ఎంఎల్ఏ పిల్లి అనంతలక్ష్మి కుటుంబీకులపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్న కారణంగా ఆమెకు టిక్కెట్టు దక్కే అవకాశాలు తక్కువని తెలుస్తోంది. పనిలో పనిగా కాకినాడ ఎంపి తోట నర్సింహంను ఎమ్మెల్యే పోటీ చేయించాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అమలాపురం లోక్ సభ పరిధిలోని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిని వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుండి పోటీ చేయిస్తారని సమాచారం. అలాగే రూరల్ నియోజకవర్గంలో కొత్త అభ్యర్ధి కోసం చూస్తున్నారు. అలాగే, రాజోలు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావును అక్కడి నుండి స్థానభ్రంశం చేయిస్తారని అంటున్నారు. ఈయనకు మరో రిజర్వుడు నియోజకవర్గం కేటాయిస్తారట. తేకపోతే పార్టీ బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నారు. దీంతో ఇతర జిల్లాల ఎమ్మెల్యేలలో కూడా గుబులు మొదలయ్యిందనే చెప్పాలి.
tdp