విజయ్ దేవరకొండ ‘నోటా’ టీజర్ : ది రౌడీ పొలిటీషియన్

nota movie teaser

రేపు సాయంత్రం ‘నోటా’ ట్రైలర్ విడుదల కాబోతోంది. వరస సంచలన విజయాల హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా టీజర్ ఒకటి విడుదల అయ్యింది. ఎలాంటి డైలాగ్ లేకుండా.. కేవలం బీజీఎం‌తో నే వచ్చిన ఈ టీజర్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ‘నోటా’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు కారణం కేవలం విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’తో సంచలనం రేపిన ఈ హీరో ఆ తర్వాత కూడా ‘గీతగోవిందం’తో మరో సంచలనం సృష్టించాడు.

  nota

ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తదుపరి సినిమాగా ‘నోటా’ ఆసక్తిని రేపుతోంది, అంచనాలను పెంచుతోంది. సినిమాపై అంచనాలను పెంచేస్థాయిలో, సినిమా ప్రామిసింగ్‌గా ఉండబోతోందనే భరోసాను ఇస్తోంది ఈ టీజర్. ‘ది రౌడీ, ది పొలిటీషియన్, ది లీడర్’ అంటూ ఇది పక్కా పొలిటికల్ డ్రామా అనే హింట్ ఇస్తూ సాగుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేసెయ్యండి మరి.