Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
65వ జాతీయ సినిమా అవార్డులని అవార్డుల కమిటీ అధ్యక్షుడు శేఖర్ కపూర్ ప్రకటించారు. ఈ సారి జాతీయ అవార్డులలో తెలుగు సినిమాలు కూడా మెరిశాయి. అటు ‘బాహుబలి 2’, ఇటు ‘ఘాజీ’ అవార్డులను పొందాయి. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ విభాగాల్లో బాహుబలి 2 అవార్డులను గెలుచుకుంది. అలాగే ఉత్తమ వినోదాత్మక సినిమాగా కూడా అవార్డును పొందింది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఘాజీ’ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది.
ఇదే జాతీయ అవార్డుల జాబితా…
దాదా సాహెల్ ఫాల్కె అవార్డు: వినోద్ ఖన్నా
బెస్ట్ యాక్టర్: రిద్ధీ సేన్, నగర్ కిర్టాన్
బెస్ట్ యాక్ట్రెస్: శ్రీదేవి (మామ్)
బెస్ట్ డైరెక్టర్: జయరాజ్ (భయానకం, మలయాళం)
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: విలేజ్ రాక్‌స్టార్స్ (అస్సామీస్)
బెస్ట్ హిందీ ఫిల్మ్: న్యూటన్
బెస్ట్ రీజినల్ ఫిల్మ్: లఢాఖ్
బెస్ట్ తెలుగు ఫిల్మ్: ఘాజి
బెస్ట్ యాక్షన్ డైరెక్షన్: బాహుబలి-2
బెస్ట్ కొరియోగ్రాఫర్ : గణేష్ ఆచార్య (టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ)
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్: బాహుబలి-2
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ : ఏఆర్ రెహమాన్ (కాట్రు వేలియిదాయ్)
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఏఆర్ రెహమాన్ (మామ్)
బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్: యేసుదాస్
బెస్ట్ పాపులర్ ఫిల్మ్: బాహుబలి-2
ఉత్తమ బాలల చిత్రం- మోర్క్య(మరాఠీ)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్-ఫవాద్ ఫాజిల్
బెస్ట్ ఫిమేల్ సింగర్- షాషా తిరుపతి(కాట్రు వెలియిడై)
బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్- వాటర్ బేబీ
బెస్ట్ ఫిల్మ్ ఆన్ సోషల్ ఇస్యూస్ – అయామ్ బొనే, వెల్ డన్ (రెండు సినిమాలు)
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే – భయానకం(మలయాళం)
బెస్ట్ షార్ట్ ఫిల్మ్(ఫిక్షన్)- మయ్యత్ (మరాఠీ)
బెస్ట్ కొరియోగ్రఫీ: గణేష్ ఆచార్య(టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ -టేకాఫ్ (మలయాళం)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్- బనితా దాస్(విలేజ్ రాక్ స్టార్స్)
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు- దివంగత నటుడు వినోద్ ఖన్నా
నర్గీస్ దత్ అవార్డు (జాతీయ సమైక్యతా చిత్రం)- దప్పా(మరాఠీ)