6 గంటలకు కోటి.. ఏం రేటుర బాబోయ్‌..!

6croces-rumunaration-for-amir-jackson-for-new-photo-shoot

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇంగ్లీష్‌ బ్యూటీ అమీజాక్సన్‌ ఇటీవల సౌత్‌లో బాగా ఫేమస్‌ అవుతుంది. తమిళంలో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ అమ్మడు తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘2.0’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. అమీజాక్సన్‌ హీరోయిన్‌గానే కాకుండా ఒక మోడల్‌గా కూడా భారీగా సంపాదిస్తూ ఉంటుంది. హాట్‌ ఫొటో షూట్‌లకు పెట్టింది పేరు అయిన అమీజాక్సన్‌ ఒక్కో ఫోటో షూట్‌కు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్‌ తీసుకుంటుందనే టాక్‌ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. తాజాగా ఒక కంపెనీ ప్రమోషన్‌ కోసం కేవలం 6 గంటల పాటు ఫొటో షూట్‌ ఇచ్చి ఏకంగా కోటి రూపాయల పారితోషికాన్ని అందుకుంది. 

సహజంగా అయితే ఒక కంపెనీకి ప్రమోషన్‌ కోసం సంవత్సరం అగ్రిమెంట్‌ తీసుకుని కోటి లేదా ఆ స్టార్‌ రేంజ్‌ను బట్టి పారితోషికం మాట్లాడుకోవడం జరుగుతుంది. కాని అమీజాక్సన్‌ కేవలం ఆరుగంటలు ఆ కంపెనీ కోసం ఫొటో షూట్‌లో పాల్గొని ఏకంగా కోటి రూపాయలను తీసుకుంది. పొటో షూట్‌ తర్వాత ఆ సంస్థతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. లైఫ్‌లాంగ్‌ ఆ ఫొటోలను సదరు కంపెనీ వినియోగించుకునేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుతం ‘2.0’ చిత్రంలో నటిస్తున్న కారణంగా ఈమెకు విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఆ క్రేజ్‌ను ఇలా వాడేసుకుంటుంది. హాట్‌ ఫొటో షూట్‌లకు, న్యూడ్‌ ఫొటో షూట్‌లకు ఈమె పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. ప్రమోషన్‌ కోసం న్యూడ్‌గా కూడా ఆ కంపెనీ ఫొటో షూట్‌లో అమీ జాక్సన్‌ ఫోజ్‌లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు:

ఇలా అయితే కష్టం భానుమతి..!

పిల్లాడితో అమ్మాయి రొమాన్స్‌కు కేంద్రం బ్రేక్‌