ఇలా అయితే కష్టం భానుమతి..!

sai pallavi reject to exposing movies

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

మలయాళి ముద్దుగుమ్మ సాయి పల్లవి ఓవర్‌ నైట్‌లో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అయ్యింది. ‘ఫిదా’ చిత్రంతో మెగా హీరో హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడితో సినిమాలు చేసేందుకు స్టార్‌ హీరోలు కూడా ఆసక్తి చూపుతున్నారు. కాని ఈ అమ్మడు మాత్రం ఇప్పటి వరకు దిల్‌రాజుకు తప్ప మరే నిర్మాతకు డేట్లు ఇవ్వలేదు, ఏ నిర్మాత వద్ద అడ్వాన్స్‌ తీసుకోలేదు. తాజాగా ఒక నిర్మాత ఒక యువ హీరోతో సినిమా కోసం సాయి పల్లవికి 1.25 కోట్ల పారితోషికం ఇచ్చేందుకు ముందుకు వచ్చాడట. కాని ఆ ఆఫర్‌ను సాయి పల్లవి సున్నితంగా తిరష్కరించింది. తాను కేవలం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం దిల్‌రాజు నిర్మాణంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ఎంసీఏ’ అనే చిత్రంలో సాయి పల్లవి నటిస్తుంది. ఆ సినిమా తర్వాత మరో చిత్రాన్ని కూడా దిల్‌రాజు బ్యానర్‌లోనే చేయనుంది. ఎన్ని చిత్రాల్లో అయినా చేసేందుకు సిద్దం కాని, మంచి కథతో పాటు, ఆ కథలో తన పాత్ర బాగుండాలని, అలాగే తన పాత్ర సమాజంలో అమ్మాయిలు అంటే గౌరవం పెంచే మాదిరిగా ఉండాలని కోరుకుంటుంది. అలాగే స్కిన్‌ షోకు మాత్రం రెండు కోట్లు ఇచ్చినా ఓకే చెప్పేది లేదు అంటూ సాయి పల్లవి ముందే ఖరాకండిగా చెప్పేస్తోంది. ఇలా కండీషన్స్‌ పెడితే, సమాజం, మంచి పాత్రలు అంటే ఈమెకు ముందు ముందు అవకాశాలు రావడం కష్టం అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను ఇలాగే ఉండి వచ్చిన ఆఫర్స్‌ను మాత్రమే చేస్తాను అంటోంది. చూద్దాం ఈ భానుమతి ఎలాంటి ఎలాంటి పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో..!

మరిన్ని వార్తలు:

ఆనందో బ్రహ్మ… తెలుగు బులెట్ రివ్యూ.

మహేష్‌కు ఎందుకంత టెన్షన్‌?

బాలయ్యని కమ్మేసిన పూరి హీరో.