బిగ్ బాస్ లో వారిద్దరికి నవదీప్‌ చెక్‌

navadeep-impressing-perfomance-in-ntr-bigg-boss-show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు ప్రేక్షకుల విశేషాధరణ పొందుతున్న ‘బిగ్‌బాస్‌’ దాదాపు సగం రోజులు పూర్తి చేసుకుంది. నెల రోజులు దాటిన ఈ షో రోజులు గడుస్తున్న కొద్ది ఆసక్తిగా సాగుతుంది. మొదట్లో ఇంట్లో చేరిన వారు కాకుండా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా దీక్షా పంథ్‌ మరియు నవదీప్‌లు బిగ్‌బాస్‌ ఇంట్లో చేరిన విషయం తెల్సిందే. వీరిద్దరు ఇంట్లో చేరడంతో ఆట మరింత ఆసక్తికరంగా సాగుతుంది. నవదీప్‌ ఎంట్రీ ఇవ్వకముందు ప్రిన్స్‌ మరియు ఆదర్ష్‌లలో ఎవరో ఒకరు బిగ్‌బాస్‌ టైటిల్‌ను గెలుచుకుంటారు అని అంతా భావించారు. కాని షాకింగ్‌గా నవదీప్‌కు ఇప్పుడు ఎక్కువ శాతం మద్దతు లభిస్తుంది. 

నవదీప్‌ ప్రస్తుతం ఇంట్లో చాలా కూల్‌గా ఆటను కొనసాగిస్తున్నాడు. బిగ్‌బాస్‌ టైటిల్‌ విన్నర్‌కు ఉండాల్సిన లక్షణాలు అన్ని కూడా ఆయనలో కనిపిస్తున్నాయి. ప్రిన్స్‌ మరియు నవదీప్‌ల మద్య కాస్త గట్టి ఫైట్‌ ఖాయం అని కొందరు భావిస్తున్నారు. అయితే ప్రిన్స్‌, ఆదర్ష్‌లు ఇక టైటిల్‌పై ఆశలు వదిలేసుకోవాల్సిందే అని, ఖచ్చితంగా నవదీప్‌కే బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ టైటిల్‌ దక్కుతుందనే అభిప్రాయం కొందరిలో వ్యక్తం అవుతుంది. మొత్తానికి బిగ్‌బాస్‌ షో వారాలు గడుస్తున్నా కొద్ది ఆసక్తిని పెంచుతూ వస్తుంది. ముందు ముందు మరెంత ఆసక్తిగా షో సాగుతుందో చూడాలి

మరిన్ని వార్తలు:

6 గంటలకు కోటి.. ఏం రేటుర బాబోయ్‌..!

ఇలా అయితే కష్టం భానుమతి..!

పిల్లాడితో అమ్మాయి రొమాన్స్‌కు కేంద్రం బ్రేక్‌