బిగ్‌బాస్‌లో కుమారి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ?

hebah patel wild card entry In bigg boss 2 house

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ఆసక్తికరంగా సాగుతుంది. మొదటి రెండు వారాలు సో సోగానే అనిపించినప్పటికి మూడవ వారం తర్వాత ఆసక్తికర పరిణామాలు జరుగుతూ ఆకట్టుకుంటూ ఉంది. ముఖ్యంగా యూత్‌ ఆడియన్స్‌ ఈ షోకు బాగా ఎట్రాక్ట్‌ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ షోకు భారీ ఎత్తున టీఆర్పీ రేటింగ్‌ వస్తున్నట్లుగా షో నిర్వాహకులు చెబుతున్నారు. మొదటి సీజన్‌లో నవదీప్‌ మరియు దీక్షా పంథ్‌లను వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా మద్యలో ఇంట్లోకి పంపించేసిన విషయం తెల్సిందే. తాజాగా ఈ రెండవ సీజన్‌లో ముగ్గురు లేదా నలుగురిని వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి పంపించేందుకు బిగ్‌బాస్‌ నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నారు.

మొదటి వారం పూర్తి అయిన వెంటనే నందినిని వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా లోనికి పంపించిన విషయం తెల్సిందే. నాలుగు వారాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం అయిదవ వారంలో అడుగు పెట్టిన బిగ్‌బాస్‌ ఆరవ వారం కోసం వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా హెబ్బా పటేల్‌ను హౌస్‌లోకి పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుమారి 21ఎఫ్‌ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హెబ్బా పటేల్‌ ఆ తర్వాత పలు చిత్రాల్లోనటించి మెప్పించింది. అయితే ఈమద్య కాలంలో ఈమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. దాంతో ఈమె బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు ఓకే చెప్పింది. బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వడం వల్ల ఈమెకు మునుపటి క్రేజ్‌ దక్కే అవకాశం ఉందని, దాంతో మళ్లీ సినిమాల్లో హీరోయిన్‌ ఛాన్స్‌లు వస్తాయనే నమ్మకంతో ఆమె ఉంది. ఈ ఆదివారం లేదా సోమవారం నాడు హెబ్బా పటేల్‌ బిగ్‌బాస్‌ ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. ఈ వార్తలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.