సాహో కోసం మరో బ్యూటీ

Amy Jackson Is Another Heroine In Prabhas Sahoo Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్‌ నటిస్తోన్న చిత్రం ‘సాహో’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని సినీ వర్గాల వారు మరియు ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌లో వంశీ మరియు ప్రమోద్‌లు ఈ చిత్రాన్ని దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో బాలీవుడ్‌ మరియు హాలీవుడ్‌ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌ ఈ చిత్రంలో నటిస్తుంది. తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయాలని, అక్కడ కూడా ఎక్కువ మార్కెట్‌ చేసేందుకు పలువురు బాలీవుడ్‌, కోలీవుడ్‌ స్టార్స్‌ను ఈ చిత్రంలో నటింపజేస్తున్నారు. 

ఇప్పటికే బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఈ చిత్రంలో నటిస్తుండగా మరో స్టార్‌ హీరోయిన్‌ అమీ జాక్సన్‌ను కూడా ఈ చిత్రంలో నటింపజేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన ఈ అమ్మడు తాజాగా శంకర్‌ చిత్రం ‘2.0’లో ఒక కీలక పాత్ర పోషించింది. ఆ చిత్రం తర్వాత ప్రభాస్‌ ‘సాహో’ చిత్రంలో అమీ జాక్సన్‌ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒక కీలకమైన పాత్రలో ఆమెను నటింపజేయనున్నారు. ప్రభాస్‌తో ఆమెకు ఒక పాట కూడా ఉండబోతుందట. మొత్తానికి ‘సాహో’ చిత్రంలో స్టార్‌ కాస్టింగ్‌ భారీగా పెంచుతూ సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతున్నారు. వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.