అవసరాల నాని.. అంతా ఓకే

Avasarala Srinivas Directing New Film With Nani

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యంగ్‌ హీరో నాని వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. హీరోగానే కాకుండా తాజాగా ‘అ!’ చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా కూడా సక్సెస్‌ను దక్కించుకున్నాడు. నిర్మాతగా వరుసగా చిత్రాలను చేస్తానంటూ చెప్పుకొచ్చిన నాని హీరోగా కూడా వరుస చిత్రాలను చేస్తూ దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కృష్ణార్జున యుద్దం’ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఆ తర్వాత శ్రీరాం ఆధిత్య దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఇంకా పలు చిత్రాలకు నాని కమిట్‌ అయిన విషయం తెల్సిందే. ఇలా వరుసగా నాని చిత్రాలు చేసుకుంటూ మరో ప్రయోగాత్మక చిత్రానికి కమిట్‌ అయ్యాడు. 

కమెడియన్‌గా, నటుడిగా మంచి పేరు దక్కించుకున్న అవసరాల శ్రీనివాస్‌ దర్శకుడిగా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. త్వరలో అవసరాల మరో సినిమాకు సిద్దం అవుతున్నాడు. ఆ చిత్రంలో హీరోగా నాని నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు పూర్తి అయిన తర్వాత నాని, అవసరాల చిత్రం సెట్స్‌ పైకి తీసుకు వెళ్లే అవకాశం ఉంది. నాని, అవసరాల మంచి స్నేహితులు అవ్వడంతో వీరిద్దరి కాంబో మూవీ తప్పకుండా భారీ క్రేజ్‌ను దక్కించుకునే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. పలువురు దర్శకులు నాని వెంట పడుతున్న నేపథ్యంలో అవసరాల శ్రీనివాస్‌కు మాత్రమే నాని ఛాన్స్‌ ఇచ్చాడు.