‘దేవదాస్‌’ చిత్రం కాపీనే!

deva das movie copied

నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ నిర్మించిన చిత్రం ‘దేవదాస్‌’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రంను వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. రికార్డు స్థాయిలో ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కూడా అమ్ముడు పోతున్నట్లుగా సమాచారం అందుతుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ ట్రైలర్‌ చూసిన తర్వాత సోషల్‌ మీడియాలో జనాలు నానా రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఈ చిత్రం ‘అనాలసిస్‌ దిస్‌’ అనే హాలీవుడ్‌ సినిమాకు కాపీ అంటూ విమర్శలు చేస్తున్నారు.

Devadas Movie Latest Poster

‘దేవదాస్‌’ చిత్రం షూటింగ్‌ ప్రారంభం అయిన సమయంలోనే ఈ చిత్రం కాపీ అంటూ కొందరు సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. ఆ సమయంలోనే దర్శకుడు శ్రీరామ్‌ ఆధిత్య స్వయంగా స్పందిస్తూ తాను కొత్త కథతో ఈ చిత్రాన్ని చేస్తున్నాను, ఏ ఒక్క చిత్రానికి ఇది రీమేక్‌ కాదు, కాపీ కాదు అంటూ తేల్చి చెప్పాడు. అయితే తాజాగా ట్రైలర్‌ విడుదలైన తర్వాత ‘అనాలసిస్‌ దిస్‌’ అనే చిత్రంలోని పాత్రలకు చాలా దగ్గరగా ఈ చిత్రం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆ చిత్రంలోని పాత్రు మరియు ఈచిత్రంలోని పాత్రల బాడీలాంగ్వేజ్‌ కూడా సేమ్‌ ఉందని, ట్రైలర్‌ చూస్తేంటే మాత్రం సగం వరకు ఆ చిత్రానికి కాపీ అయ్యి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా విడుదలైతే అప్పుడు నూరు శాతం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.