బాబ్లీ వివాదం లో ధర్మాబాద్ కోర్టు సంచలన తీర్పు

Shock To CBN By Dharmabad Court

బాబ్లీ కేసులో రీకాల్ పిటిషన్‌పై ధర్మాబాద్ కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ఈ కేసు కి సంబంధించి చంద్రబాబు తరుపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేసారు, కానీ ఈ పిటిషన్ ని కోర్ట్ తిరస్కరించింది. వొచ్చే నెల 15 వ తారీఖు చంద్రబాబు తో సహా నాన్ బెయిలబుల్ వారంట్ అందుకున్న 16 ఎమ్మెల్యే లన్ని కూడా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

AP CM Chandrababu

చంద్రబాబు కు సంబంధించిన న్యాయవాది సొంత సమయాన్ని కోరగా దానికి కోర్టు ఎవరికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చే ప్రసక్తి లేదని. అయితే ఈ కేస్ తుదిపరి విచారణను అక్టోబర్ 16 కు వాయిదా వేశారు. చంద్రబాబు తో సహా నోటీసులు అందుకున్న వారి తరుపు న్యాయవాదులు రీకాల్ పిటిషన్ కోసం కోర్టుని ఆశ్రయించగా, కోర్టులో తీవ్ర వాదోప వాదనలు జరిగాయి. తమ క్లైంట్స్ కి నోటీసులు అందలేదని, నోటీసులు జారీ చెయ్యకుండా కోర్టు కి ఎలా హాజరు కావాలని కోరుతారని న్యాయవాదులు వాదించారు. తమకు పూర్తిగా ఈ విషయం పై అవగాహనా లేదని, మేము మీడియా పై వొచ్చిన కథనాలను చూసి కోర్టుకి రావడం జరిగిందని మాకు కొంచం సమయం కావాలని అడుగగా దానికి కోర్ట్ అంగీకరించలేదు. ముఖ్యమంత్రి అయినా కోర్టు ఆదేశాలను పాటించాల్సిందే అని న్యాయమూర్తి పేరుకున్నారు. అంతేకాకుండా చట్టానికి ఎవరు మినహాయింపు కాదని, ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే కోర్టు ఆదేశాలను పాటించాలని కోర్టు వారు తరుపు న్యాయవాదులు కు చురకులు అంటించింది. దీని పై టీడీపీ పార్టీ కొంచం కలవరం చెందుతుంది. అయితే కార్యకర్తలు కోర్టు ఆదేశాలను పాటించి హాజరు కావడం మంచిదని కోరుకుంటున్నారు.

బాబ్లీ వివాదం లో ధర్మాబాద్ కోర్టు సంచలన తీర్పు - Telugu Bullet

ఇదిలాఉండగా ధర్మాబాద్ కోర్టుకు హాజరైన కొందరు నేతలు గంగుల కమలాకర్‌, ప్రకాశ్‌గౌడ్‌, కె.ఎస్‌ రత్నం నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు కోరుతూ రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వారికి ఐదు వేల జరిమానా విధించిన కోర్టు ఆ ముగ్గురికీ బెయిల్‌ మంజూరు చేసింది.