పిక్‌ టాక్‌ : సమంత ఏంటీ ఈ డ్రస్‌?

Samantha Photo Talk In Devadas Pre Audio Launch

అక్కినేని వారి ఇంటి కోడలు అయిన సమంత ప్రతి మూమెంట్‌ను అక్కినేని అభిమానులు జాగ్రత్తగా చూస్తున్నారు. ఆమె ఏ చిన్న తప్పు చేసినా కూడా విమర్శించేందుకు రెడీగా ఉంటున్నారు. తాజాగా నాగార్జున నటించిన ‘దేవదాస్‌’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో సమంత పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ కార్యక్రమంలో సమంత వేసుకున్న డ్రస్‌ విమర్శలను లేవనెత్తుతుంది. చిత్రంలో హీరోయిన్స్‌గా నటించిన వారు పద్దతిగా మంచి డ్రస్‌లు వేసుకుని రాగా సమంత మాత్రం ఇలా చెత్త డ్రస్‌ వేసుకుని వచ్చింది ఏంటీ అంటూ అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

syam

నాగార్జున, అమలా ఇంకా పలువురు ప్రముఖులు మరియు అక్కినేని కుటుంబ సభ్యులు, అక్కినేని ఫ్యాన్స్‌ హాజరు అయిన ఈ వేడుకలో ఇలాంటి డ్రస్‌తో పాల్గొనడం ఏంటని కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. నాగార్జున పక్కన ఇలాంటి డ్రస్‌తో కూర్చోవడానికి కాస్తయినా ఇబ్బంది అనిపించడం లేదా అంటూ సోషల్‌ మీడియాలో సమంతను టార్గెట్‌ చేస్తున్నారు. ఎంత హీరోయిన్‌ అయినప్పటికి అక్కినేని హీరోను పెళ్లి చేసుకున్నప్పుడు కాస్త పద్దతిగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ అక్కినేని అభిమానులు అంటున్నారు.-