మీసమున్న మగాడివైతే ఖాకీ బట్టలు తీసేసి రా !

JC Challenges Gorantla Madhav

అనంతపురం జిల్లాలో ప్రబోధానంద స్వామి ఆశ్రమం వివాదం కాస్తా అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి వర్సెస్ పోలీసులుగా మారిపోయింది. ప్రబోధానందస్వామి ఆశ్రమం మూసివేయించాలంటూ డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగిన జేసీ ఈ వ్యవహారంలో పోలీసులు చేవలేకుండా ప్రవర్తించారని ఆరోపించారు. సిగ్గులేని పోలీసులు, నిర్వీర్యమైన వ్యవస్థ, పోలీసులు ఉన్నట్టా చచ్చిపోయినట్లా అంటూ వ్యాఖ్యానించారు జేసీ. దీంతో పోలీసులు మీద దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా పోలీస్‌ అసోషియేషన్ నేత మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

CI Gorantla Madhav strong warning

జేసీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకపై నోరు అదుపుతప్పితే చాలా సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటామన్నారు. పోలీసు వ్యవస్థను కించపర్చేలా మాట్లాడితే నాలుకలు తెగ్గోస్తామంటూ ఘాటుగా వార్నింగ్‌ ఇచ్చారు . దీంతో దివాకర్ రెడ్డి స్పందిస్తూ పలనావాడు కొజ్జా అంటూ తాను ఏ ఒక్కరి పేరును ఉచ్చరించలేదని చెప్పారు. అయినా ‘కొజ్జా’ అనే పదంలో తప్పేముందని ఆయన మీడియాను ప్రశ్నించారు. కొజ్జా అనే పదం తప్పైతే క్షమాపణ చెప్పడానికైనా పోలీసుల కాళ్లు పట్టుకొని పాదాభివందనం చేసేందుకైనా సిద్ధమని అన్నారు.

JC Devakar reddy

ప్రబోధానంద స్వామి ఆశ్రమం వద్ద అల్లర్లు జరుగుతుంటే… అంత మంది పోలీసులుండి, అయుధాలు ఉండి కూడా ఏమీ చేయలేకపోయారని జేసీ విమర్శించారు. మాధవ్ తన చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేశాడో ఆయనకే బాగా తెలుసని చెప్పారు. ఇదేమైనా సాయికుమార్ సినిమానా మీసాలు తిప్పడానికి రియల్ లైఫ్ వేరు, సినిమాలు వేరని చెప్పారు. నన్నే హెచ్చరించే అంత మగాడివా? అంటూ వార్నింగ్ ఇచ్చారు. మీ ఇంటికి రావాలా? మీ పోలీస్ స్టేషన్ కు రావాలా? అనంతపూర్ క్లాక్ టవర్ వద్దకు రావాలా? లేదా మీ ఊరికి రావాలా? చెప్పు? అంటూ సవాల్ విసిరారు. ‘నాలుకే కోయాలనుకుంటే వచ్చి కోసేయ్ నీ కత్తి ఎంత పదునుగా ఉందో చూస్తా’ అని జేసీ సవాల్ విసిరారు.