అమ్మ మూవీ మొదలైంది, కాని..!

Jayalalitha Biography In TV

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్‌కు ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెల్సిందే. తమిళనాట ఏకంగా ముగ్గురు ప్రముఖ నిర్మాతలు అమ్మ బయోపిక్‌ గురించి ప్రకటన చేశారు. తెలుగు వ్యక్తి విష్ణు ఇందూరి ఇటీవలే తమిళనాట జయలలిత బయోపిక్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటించాడు. తమిళ స్టార్‌ డైరెక్టర్‌ విజయ్‌ ఏఎల్‌ దర్శకత్వంలో ఈ బయోపిక్‌ ఉంటుందని ప్రకటించాడు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌కు తీసుకు వెళ్లబోతున్న నేపథ్యంలోనే అమ్మకు సంబంధించిన మరో బయోపిక్‌ పట్టాలెక్కింది. ప్రియదర్శిణి అనే తమిళ దర్శకురాలి దర్శకత్వంలో ‘ఐరెన్‌ లేడీ’ అనే టైటిల్‌తో జయలలిత మూవీ పట్టాలెక్కబోతుంది.

jayalalitha biopic

తాజాగా మురుగదాస్‌ చేతుల మీదుగా ఈ చిత్రం పోస్టర్‌ను ఆవిష్కరించడం జరిగింది. విష్ణు ఇందూరి నిర్మాణంలో ఈ చిత్రం వస్తే చూడాలని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని ఇప్పటికే ఐరెన్‌ లేడీ మొదలు అవ్వడంతో కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఐరెన్‌ లేడీ ప్రారంభం అయిన కారణంగా విష్ణు, విజయ్‌లు సినిమాను పూర్తి చేస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్‌ బయోపిక్‌తో పాటు, బాలీవుడ్‌లో కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ను కూడా విష్ణు ఇందూరి నిర్మిస్తున్నాడు. తమిళంలో అమ్మ బయోపిక్‌ను కూడా ఆయనే తెరకెక్కిస్తే బాగుండేది అంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.