సామీ సినిమా రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్

saamy movie review

నటీనటులు: విక్రమ్, కీర్తి సురేష్, ఐశ్వర్య రాజేష్, బాబీ సింహా, ప్రభు మరియు తదితరులు
దర్శకుడు: హరి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: శిబు తమీమ్స్
సినిమాటోగ్రఫీ: ప్రియన్, వెంకటేష్ అనురాగ్

Vikram Saamy Movie Working Stills

మొదటి సారి విక్రమ్ స్వామి సినిమా తమిళ్ లో వచ్చి సూపర్ దుపెర్ హిట్ అయ్యింది. అదే సినిమా బాలయ్య బాబు తెలుగులో లక్ష్మీ నరసింహగా తీసి హిట్ కొట్టారు. ఇప్పుడు విక్రమ్ దానికి సీక్వెల్ గా స్వామీ స్క్వేర్ ని దించారు. చాలా రోజుల తరువాత విక్రమ్ భీభాత్సమయిన మాస్ కథతో వస్తున్నారు. అందులోనూ, ఈ సినిమాను కథనాన్ని సూపర్ ఫాస్ట్ గా పరిగెత్తించే హరి డైరెక్ట్ చేయడం ఇంకా అనువైన విషయం. అప్పట్లో స్వామి లో త్రిష నటించగా, ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ మరియు కీర్తి సురేష్ నటించారు. సరే మరి ఇన్ని అంచానాలతో వచ్చిన స్వామి గారూ ఎలా ఉన్నారో చూద్దాం…

కథ:

'Saamy' Review Live Updates
రామ స్వామి (విక్రమ్) సెంట్రల్ మినిస్టర్ దగ్గర మేనేజర్ గా పనిచేస్తారు. అలాగే, రామస్వామి సివిల్స్ ఎగ్జామ్స్ రాసి, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈలోగా, మినిస్టర్ కూతురు (కీర్తి సురేష్) రామస్వామి తో లవ్ లో పడుతుంది. ఇక ఈ సమయంలోనే, సివిల్స్ రిజల్ట్స్ వస్తాయి మరియు అందులో రామస్వామి ఫస్ట్ గ్రేడ్ తో పాస్ అవతాడు. కానీ, ఐ.పి.ఎస్ ఎంచుకుంటాడు లాగే విజయవాడ లో ఫస్ట్ పోస్టింగ్ పడుతుంది. రామస్వామి తన తండ్రి పరశురామ స్వామిని చంపిన రావణ బిక్షు గురించి, విజయవాడలో అతనికి ఉన్న బలం గురించి తెలుసుకుంటాడు. ఇక ఆ తరువాత కథ ఎటు పరిగేట్టిందో తెర మీదే చూడాలి…

విశ్లేషణ:

saamy movie

విక్రమ్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాలా… స్వామి పాత్రలోకి ఆయన పరకాయ ప్రవేశం చేశారు. చాలా రోజుల తరువాత పూర్తి మాస్ గెట్ అప్ లో తనివితీరా జీవించేసారు. ఇక రామస్వామి, పరశురామ స్వామి, రెండు పాత్రలలోనూ వైవిధ్యతను ప్రదర్శించారు. ఇక, ఐశ్వర్య రాజేష్ మరియు కీర్తి సురేష్ వారి వారి పత్రాలను శ్రద్ధగా చేసేసారు. అలాగే, సూరి కూడా నవ్వించే ప్రయత్నం చేస్తూ బాగేనే సక్సెస్ అయ్యారు. అదే విధంగా, బాబీ సింహా రావణ బిక్షుగా, ప్రభు సెంట్రల్ మినిస్టర్ గా బాగా చేశారు, అలాగే మిగిలిన వాళ్ళందరూ వారి వారి పాత్రల మేరకు బాగా చేశారు.

saamy hashtag on Twitter

ఇక కథ విషయానికి వస్తే, కథ కొంత రొటీన్ గానే ఉన్నా, మంచి మాస్ మేళవింపులతో కథనం బాగా సాగుతుంది. అలాగే, డైలాగ్స్ కూడా బాగున్నాయి, కానీ, పాటలే కొంచెం బాగా అనిపించలేదు. అంటే, తమిళ్ లిరిక్స్ తెలుగులోకి అనువదించడం వల్ల అలా అనిపిస్తుంది.ఇక సాంకేతిక విభాగంకి వస్తే, మన రాక్ స్టార్ దేవిశ్రీ ఇచ్చిన సంగీతం మనకు అంతగా నచ్చదు అని చెప్పొచ్చు. ఎందుకంటే, లిరిక్స్ ని అలా అనువదించడం వల్ల పాటలో ఆ మేజిక్ మిస్ అవుతుంది. కానీ, దేవిశ్రీ మ్యూజిక్ లో ఏ ప్రాబ్లం లేదని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చెప్తుంది. అలాగే, సినిమాటోగ్రఫీ బాగుంది, యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని బాగున్నాయి. అదేవిధంగా, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అద్భుతంగా ఉన్నాయి.

Saamy square story continues with Saamy movie

మొత్తానికి, స్వామి ఒక పక్కా మాస్ మూవీ, అలాగే తన తండ్రి చంపిన వాడిని చంపడానికి వచ్చే ఒక పోలీస్ రివేంజ్ స్టొరీ. మొదటి భాగం ఎక్కువగా పాత్రల పరిచ్యాలకే పోతుంది. కానీ, రెండవ భాగం మాత్రం హరి మార్క్ కెమెరా యాంగిల్స్ తో యాక్షన్ సీన్స్ తో సినిమా మరో స్థాయికి వెళ్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది గాని పాటలు కూడా వినసొంపుగా ఉంటె బాగుండు అనిపిస్తుది. ఫైనల్ గా, సినిమా మాస్ ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది.

తెలుగు బుల్లెట్ పంచ్ లైన్: స్వామి… మీసం మెలేసాడు…

తెలుగు బుల్లెట్ రేటింగ్: 2.5/5