అలాంటి ఆలోచనే లేదన్న కీర్తి

keerthi suresh clarity on jayalalitha biopic movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు ప్రేక్షకులకు ‘నేను శైలజ’ చిత్రంతో అభిమాన హీరోయిన్‌గా మారిన కీర్తి సురేష్‌ టాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేస్తూ టాప్‌ హీరోయిన్‌ రేంజ్‌కు ఎదిగింది. తమిళంలో స్టార్‌ హీరోల సరసన నటిస్తూ తనకంటూ ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు తాజాగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ‘మహానటి’ చిత్రంలో నటించి మెప్పించింది. ఆ సినిమా అద్బుతమైన కళా ఖండంగా నిలిచింది. మహానటిగా నటించడం అంటే మాములు విషయం కాదు. అలాంటిది మహానటి పాత్రకు జీవం పోషి అద్బుతమైన నటన కనబర్చింది. కొన్ని సీన్స్‌లో మహానటి సావిత్రిని సైతం మించింది అంటూ ప్రశంసలు దక్కించుకుంది అంతటి పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ త్వరలో జయలలిత జీవిత చరిత్రలో నటించబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

తమిళ నాట జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు ఒక నిర్మాత గత ఆరు నెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అమ్మ సినీ జీవితం మరియు రాజకీయ జీవితంను ప్రేక్షకుల ముందు ఆవిష్కరించాని, ఆమె మరణం వెనుక ఉన్న రహస్యాలను వెలికి తీయాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. ఆయన ప్రయత్నంకు కీర్తి సురేష్‌ తోడు అయితే బాగుంటుందని భావించారు. కీర్తి సురేష్‌ పేరును అమ్మ పాత్రకు ఆయన పరిశీలించాడు. ఇదే విషయాన్ని కీర్తి సురేష్‌ను ప్రశ్నించగా మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని, తాను జయలలిత పాత్రలో కనిపించబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని, అసలు తనకు అలాంటి ఆలోచన లేదని, కొందరు శ్రీదేవి పాత్ర గురించి అడుగుతున్నారు. వీరిద్దరి జీవిత చరిత్రలో నటించడం తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పింది. కొన్ని సంఘటనలు యాక్సిడెంటల్‌గా జరుగుతాయి. అలా జరిగిందే మహానటి. అలా మళ్లీ ఎప్పుడు జరగదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.