దేవదాస్ ట్రైలర్…కిక్కు ఎక్కెలె

Devdas Movie Trailer

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్లలో దేవదాస్ ఒకటి. నాగార్జున‌, నాని ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 27న విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మైంది. కొద్ది రోజులుగా టీజ‌ర్‌, సాంగ్స్‌తో అల‌రించిన టీం నిన్న జ‌రిగిన ఆడియో వేడుక‌లో ట్రైల‌ర్ విడుద‌ల చేసింది. 2:06నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ చూస్తుంటే చిత్రం మొత్తం కామెడీ ఎంటర్టైనర్ లా అనిపిస్తుంది. నాగ్ ,నాని ల మధ్య వచ్చే సన్నివేశాలు ఈచిత్రానికి హైలైట్ కానున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. దేవ పాత్ర‌లో నాగార్జున‌, దాస్ పాత్ర‌లో నానిలు సరికొత్త వినోదాన్ని అందించ‌నున్నార‌ని ట్రైల‌ర్‌ని బ‌ట్టి తెలుస్తుంది. మరి అందరినీ అలరిస్తున్న ట్రైలర్ మీద మీరు కూడా ఒక లుక్ వేసెయ్యండి మరి.