మహారాష్ట్రలో సోమవారం రాత్రి బ్రిడ్జిపై నుంచి కారు పడిపోవడంతో బీజేపీ ఎమ్మెల్యే విజయ్ రహంగ్‌డేల్ కుమారుడు ఆవిష్కర్ రహంగ్‌డేల్ సహా ఏడుగురు వైద్య విద్యార్థులు మరణించారు. విద్యార్థులు డియోలీ నుంచి వార్ధాకు వెళుతుండగా సెల్సురా గ్రామ సమీపంలో వంతెనపై నుండి కారు పడిపోయిందని పోలీసులు తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం ఈ ప్రమాదం సోమవారం రాత్రి 1.30 గంటల ప్రాంతంలో జరిగింది. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పవడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
వీరంతా వార్ధాలోని సావాంగి మెడికల్ కాలేజీ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. మృతులు.. నీరజ్ చౌహాన్, వివేక్ నందన్, ప్రత్యూష్ సింగ్, శుభమ్ జైస్వాల్ ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థులు కాగా, అవిష్కర్ రహంగ్‌డేల్, పవన్ శక్తి మొదటి సంవత్సరం విద్యార్థులు, నితేష్ సింగ్ మెడికల్ ఇంటర్న్. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేస్తూ మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి ₹ 2 లక్షలు గాయపడిన వారికి ₹ 50,000 ప్రకటించారు.