టీవీ సీరియల్‌ చూసి ఏడేళ్ళ చిన్నారి ఆత్మహత్య !

7-Years-Old Girl Died while watching TV Serial

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టీవీ సీరియళ్లు, సినిమాలు చూస్తూ పలువురు వాటిని అనుకరిస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్న సంఘటనలు అనేకం ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. టీవీ సీరియళ్లలో చూపించే సన్నివేశాలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలిపేందుకు ఈ ఘటనే నిదర్శనం. టీవీ సీరియల్‌లో వచ్చిన ఆత్మహత్య సీన్‌ను అనుకరించి ఓ ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన కోల్‌కతా, ఇచ్చాపుర్‌ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ ఘటన చోటుచేసుకున్న సమయంలో ఆ చిన్నారి రెండు నెలల తమ్ముడు మినహా ఇంట్లో ఎవరూ లేరు. బ్యాంక్‌లో డబ్బు డిపాజిట్‌ చేయడానికి ఆ చిన్నారి తల్లి బయటకు వెళ్లగా… తండ్రి రోజువారి పని మీద వెళ్లాడు. 2 నెలల బాబు మాత్రమే ఉన్నాడు. అయితే ఆ తల్లి తన పిల్లలను ఓ కంట కనిపెట్టమని, పక్కింటి వారికి సైతం చెప్పింది. కానీ ఆమె తిరొగొచ్చేసరికి స్కార్ఫ్‌తో ఉరేసుకున్న తన బిడ్డ కనిపించింది.

వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు పేర్కొన్నారు. ఆ చిన్నారి రోజు సీరియల్స్‌లో వచ్చే సీన్స్‌ను అనుకరించేదని, వాటిని చూసి తామంతా మురిసిపోయేవాళ్లమని, కానీ ఇంతటీ ఘోరం జరుగుతుందని ఊహించలేదంటూ ఆ బాలిక బంధువులు కన్నీటీ పర్యంతమయ్యారు. సీరియళ్లను అనుకరిస్తూ చిన్నారులు చనిపోవడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల మీరట్‌లో ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఇలానే చనిపోయింది. 2017లో ఏడేళ్ల చిన్నారి సీరియల్‌లో వచ్చిన సీన్‌ను చూసి ఒంటికి నిప్పంటించుకుని చనిపోయింది. పిల్లలు చూసే సీరియల్స్‌, టీవీ షోల పట్ల అప్రమత్తంగా ఉండాలి లేకపోతే ఇటువంటి ఘటనలు మన ఇంటిలోనూ జరిగే అవకాశం లేకపోలేదు.