జగన్ తో టచ్ లో ఉన్న టీడీపీ కీలక నేత !

Varadarajulu Reddy says CM Ramesh touch with Ys Jagan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టీడీపీ నేత, రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ పై ఆ పార్టీకి చెందిన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంచార్జ్ వరదరాజులు రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గత నాలుగేళ్లుగా సీఎం రమేష్, వరదరాజులు రెడ్డి మధ్య అంతర్గత విభేదాలు ఉన్నా అధినేత వల్ల ఇప్పటివరకు బయటకు రాలేదు. రెండేళ్ల క్రితం జరిగిన ఓ ఉపఎన్నిక సమయంలో ఈ విభేదాలు పొడచూపగా, వీరి మధ్య వ్యాపారపరమైన వైరం కూడా ఉందని జిల్లాల్లో టాక్. తనకు రావాల్సిన కాలువ తవ్వకాల బిల్లుల చెల్లింపులు అందకుండా రమేష్ అడ్డుకుంటున్నారని వరదరాజులు రెడ్డి ముందు నుండి మండిపడుతున్నట్టు తెలుస్తుంది.

Varadarajulu Reddy says CM Ramesh touch with Ys Jagan

తాజాగా ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏకంగా వైసీపీకి సీఎం రమేష్ మద్దతుదారుడని, జగన్ తో ఆయన నిత్యం టచ్ లో ఉంటారని ఆరోపించారు. ‘సీఎం రమేష్ స్థాయి పంచాయతీ ఎన్నికలకు ఎక్కువ, మండలి ఎన్నికలకు తక్కువ. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తా లేని సీఎం రమేష్‌కు.. గ్రూపు రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు. రమేష్ గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు. టీడీపీ గెలిచే స్థానాల్లో కూడా ఓడిపోయేలా సర్వనాశనం చేసి సీఎం రమేష్ ఓడిపోయేలా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు దయవల్లే సీఎం రమేష్ ఎంపీ అయ్యారని చెప్పారు వరదరాజులు. ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చిన రమేష్ టీడీపీలో చిచ్చు రేపుతున్నారు. కుందూ-పెన్నా వరద కాలువ పనుల్లో ఐదు శాతం మామూళ్లు ఇవ్వాలని రమేష్ డిమాండ్ చేస్తున్నారు’ అని మండిపడ్డారు.