జమ్మూకశ్మీర్ లో 8 మంది టెర్రరిస్ట్ లు హతం….

ఓ పక్క కరోనా విస్తరిస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కానీ… ఇదే సమయంలో చైనా.. పాకిస్థాన్ లు భారత్ పై కాలు దువ్వుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో భారత భద్రతా బలగాలు మరో ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చాయి. షోపియాన్, పాంపొరా ప్రాంతాల్లో 24 గంటలుగా ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఆపరేషన్‌ సాగిస్తున్నాయి.

అయితే పాంపొరాలోని ఓ మసీదులో నక్కిన ఉగ్రవాదులను బయటకు రప్పించడానికి భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్‌ను విజయవంతంగా ప్రయోగించారు. దీంతో మసీదుకు నష్టం కలగకుండా అన్ని చర్యలు తీసుకుని వారిని హతమార్చినట్లు అధికారులు వివరించారు.  షోపియాన్‌లో మొత్తం ఐదుగురిని, పాంపొరాలో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు.

 అంతేకాకుండా ఈ రోజు ఉదయం 10.45 నుంచి పాకిస్థాన్‌ రేంజర్లు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. పాక్‌ బలగాలు కాల్పులకు తెగబడుతుండడంతో వారి దాడిని భారత భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయి. కాగా రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో కూడా పాక్‌ జవాన్లు కాల్పులకు తెగబడుతున్నారు.