మళ్ళీ బ్యాంక్ రుణ మేళా కార్యక్రమం

మళ్ళీ రుణ మేళా కార్యక్రమం

బ్యాంకులు నిర్వహించిన రుణమేళా అక్టోబర్‌ 1నుంచి 9వరకు తొమ్మిది రోజులు జరిగింది.ఈ  కార్యక్రమంలో 81,781కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చెసినట్టు ఇందులో నూతనంగా జారీ చేసిన రుణాలు 34,342 కోట్ల రూపాయలు అని కేంద్ర ఆర్థిక శాఖా కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ మీడియా సమావేశంలో తెలిపారు. నిబంధనల మేరకు అర్హులైన వారికి రుణాలు పంపిణీ చేస్తామని, తగినంత నిధులు బ్యాంకుల వద్ద ఉందని..మళ్ళీ ఈ నెల 21 నుంచి 25 వరకు రుణ మేళా కార్యక్రమం ఉండబోతుందని రాజీవ్‌ కుమార్‌ మీడియా ద్వారా తెలిపారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో సమావేశమై సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఇంకా పెద్ద కార్పొరేట్‌ సంస్థల నుంచి చేయాల్సిన చెల్లింపులు సాఫీగా  జరగడానికి కావాల్సిన చర్యలను బిల్‌ డిస్కౌంటింగ్‌ లాంటి సదుపాయలని అందివ్వాలని బ్యాంక్ లని కోరారు.