హీరోయిన్‌ సరే.. హీరో పరిస్థితి ఏంటీ…?

96 Movie Telugu Remake By Samantha Akkineni

తమిళ సూపర్‌ హిట్‌ మూవీ ‘96’ను రీమేక్‌ చేసేందుకు దిల్‌రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు. అల్లు అర్జున్‌, నాని, శర్వానంద్‌, గోపీచంద్‌ ఇంకా పలువురు హీరోల పేర్లు వినిపించాయి. కాని ఇప్పటి వరకు రీమేక్‌లో హీరో పాత్రకు ఎవరు ఫిక్స్‌ అయ్యారు అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఈ చిత్రంలో హీరో పాత్ర కాస్త ఏజ్‌ ఎక్కువ వ్యక్తిగా కనిపించడంతో పాటు, డీ గ్లామర్‌గా కనిపించాల్సి ఉంటుంది. అందుకే ఈ పాత్రను చేసేంత సత్తా, దమ్ము, ధైర్యం ఎవరు చేయలేక పోతున్నారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Dil Raju Could Not Find Actors For 96 Remake

హీరో ఇంకా సెట్‌ అవ్వకుండానే హీరోయిన్‌ సమంత తాను లీడ్‌ రోల్‌ లో నటిస్తాను అంటూ ముందుకు వచ్చింది. తాను త్రిష పాత్రను పోషిస్తాను అంటూ ఇప్పటికే దిల్‌రాజుకు హామీ కూడా ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ‘96’ మూవీ తెలుగులో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తుండగా హీరో ఎంపిక దిల్‌రాజుకు పెద్ద ప్రహసనంలా మారింది. ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారనేది మరో నెల రెండు నెలల్లో తేలే అవకాశం ఉంది. విజయ్‌ సేతుపతి తమిళనాట ఈ చిత్రంతో స్టార్‌ అయ్యాడు. కాని అదే సినిమాను, అదే పాత్రను చేసేందుకు మాత్రం తెలుగు హీరోలు జంకుతున్నారు. తమిళం 96 మూవీని తెలుగులో ఇంకా మొదలు పెట్టకుండానే కన్నడంలో మొదలు పెట్టారు. చిత్రీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.