క్లాస్ మేట్ ని బెదిరించి మూడు లక్షలు కొట్టేసిన 9త్ క్లాస్ పిల్లలు 

9th-class-kids-who-threaten-a-classmate-and-hit-three-lakhs

తొమ్మిదో తరగతి విద్యార్థులు చిన్న వయస్సులోనే పక్కదారి పట్టిన ఇద్దరు విద్యార్థులు క్లాస్‌మేట్‌‌ను వేధిస్తూ అతడి నుంచి ఏకంగా రూ.3లక్షలు కొట్టేశారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో సంచలనం సృష్టించిన కేసు వివరాలిలా ఉన్నాయి..  ముంబయిలోని కాలాంబోలి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతడి తండ్రి ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తుండటంతో డబ్బుకు లోటులేదు.

దీన్నే అవకాశంగా తీసుకుని తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తామని విద్యార్థిని బెదిరించారు ఇద్దరు క్లాస్‌మేట్స్. డబ్బులు అవసరం ఉన్నప్పుడల్లా అతడిని బెదిరించి భారీగా గుంజేవారు. అలా ఏడాది కాలంగా సుమారు రూ.3లక్షల మేర ఆ విద్యార్థి నుంచి డబ్బులు వసూలు చేవారు. బాధిత బాలుడికి ఇటీవల ఆరోగ్యం బాగోలేకపోవడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్య పరీక్షలు చేస్తున్న సమయంలో బాలుడు తన ఫోన్ తల్లికి ఇచ్చాడు.

ఆ సమయంలో బాలుడి ఫోన్‌కు కాల్ వచ్చింది. దాన్ని అతడి తల్లి రిసీవ్ చేసుకోగా అవతలి వైపు నుంచి ఓ బాలుడు ‘నీ పని అయిపోయిందా?. మాకు డబ్బు కావాలి’ అంటూ డిమాండ్ చేశాడు. ఫోన్ చేసిన వ్యక్తి తన కుమారుడి స్నేహితుడని తెలుసుకున్న ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పింది.

దీంతో అతడు నీ స్నేహితులు డబ్బు ఎందుకు అడుతున్నారు? చాలా రోజులుగా ఇంట్లో డబ్బులు పోతున్నాయి, నువ్వే తీస్తున్నావా? అని ప్రశ్నించాడు. తండ్రి బెదిరించేసరికి బాలుడు విషయం మొత్తం చెప్పేశాడు. ఇంట్లో డబ్బులు తానే తీసి క్లాస్‌మేట్స్‌కు ఇస్తున్నానని, ఇవ్వకపోతే తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని చెప్పాడు.

కొడుకు చెప్పిన విషయాలు విని షాకైన తండ్రి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకు నుంచి 2018 నుంచి 2019 జూన్ వరకూ అతడి స్నేహితులు రూ.2.5లక్షల నగదు, రూ.30వేల విలువైన బంగారం, రూ.10వేల విలువైన సెల్‌ఫోన్ బలవంతంగా తీసుకున్నారని తెలిపాడు.