మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. అలానే నటుడు, కమెడియన్ సునీల్ గురించి కూడా పరిచయం అవసరం లేదు . వీళ్ళిద్దరూ కూడా అందరికీ సుపరిచితమే. సునీల్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మధ్య స్నేహ బంధం ఉందని అందరికీ తెలుసు. చాలా సందర్భాల్లో వీళ్ళిద్దరూ వాళ్ళ యొక్క స్నేహం గురించి చెప్పుకొచ్చారు. గతంలో వీళ్ళు ఇద్దరు కలిసి సినిమాలు చేశారు.
ప్రస్తుతం ఎవరి పనిలో వాళ్ళు ఉంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు తో పాన్ ఇండియా సినిమా ని చేస్తున్నారు. పుష్ప టు సినిమాలో విలన్ గా సునీల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళ స్నేహాన్ని పెళ్లి రూపంలో కూడా చూపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. త్రివిక్రమ్ సునీల్ పెళ్లి కూడా ఒకేసారి జరిగింది. కేవలం కొన్ని గంటలది వ్యవధిలోనే వీళ్ళ పెళ్లి జరిగింది. అది కూడా హైదరాబాద్లోనే. 2002లో అక్టోబర్ 11న త్రివిక్రమ్ శ్రీనివాస్ సౌజన్య ని పెళ్లి చేసుకున్నారు. అదే రోజు సునీల్ సాయంత్రం ఏడు గంటలకి హైదరాబాద్లో శిల్పారామంలో శృతి ని పెళ్లి చేసుకున్నారు.