మరికొద్ది గంటల్లో రానున్నటువంటి 2020 నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకొని హైదరాబాద్ నగర పోలీసులు, నగరంలోని వాహన దారులందరికి కూడా ఒక ఘోరమైన షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కాగా ఈ మేరకు నేడు హైదరాబాద్ నగరంలోని ఫ్లై ఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్లు, ప్రధాన రహదారులు, అన్నింటిని కూడా రద్దు చేస్తూ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు హైదరాబాద్ నగర పోలీసులు… అయితే ఈ నిర్ణయానికి సంబందించిన రూల్స్ అన్ని కూడా నేటి అర్థరాత్రి 11 గంటల నుండి రేపు తెల్లవారి జామున 5 గంటల వరకు అమలులో ఉండనున్నాయని సమాచారం.
కాగా నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని, నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందుగానే కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా వాహనాల తనిఖీలను కూడా ముమ్మరంగా చేపట్టారు. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డుపై లైట్ మోటార్ వెహికల్స్ రావడానికి పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఈమేరకు గచ్చిబౌలీ, బయోడైవర్శిటీ, సైబర్ టవర్స్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్లు, ఎల్బీనగర్‌లో కామినేని ఆస్పత్రి ఫ్లైఓవర్, చింతల్‌కుంట అండర్‌పాస్‌లు, సిటీలోని నల్గొండ చౌరస్తాలోని ఫ్లైఓవర్ తోపాటుపంజాగుట్టలోని ఫ్లైఓవర్‌ను అర్థరాత్రి 11 గంటల నుండి మూసివేయనున్నారని సమాచారం.