తెలుగు దేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ

తెలుగు దేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తెలుగు దేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ

రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి రోజు రోజు కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఎన్నికల్లో ఎప్పుడైతే టీడీపీ పార్టీ ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుందో ఇక అప్పటినుండి సొంత పార్టీ నేతలే టీడీపీ పార్టీ కి గుడ్ బై చెప్పి వెళ్లిపోతున్నారు. కాగా తాజాగా టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా టీడీపీ కి పెద్ద షాక్ ఇచ్చి బీజేపీ లో చేరడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఇకపోతే తాను బీజేపీ లో ఎప్పుడు చేరతానని అధికారికంగా వెల్లడించారు. కాగా అనంతపురంలో ఆదివారం నాడు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను జేసీ కలవడంతో అందరిలో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈమేరకు మాట్లాడిన జేసీ…పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)ను బీజేపీ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్న రోజు బీజేపీ లో చేరతానని జేసీ ప్రకటించారు.ఇకపోతే రాష్ట్రానికి మూడు రాజధానులను నిర్మిస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటనపై స్పందించిన జేసీ… సీఎం జగన్ ఫై కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. కాగా రాష్ట్రానికి రాజధానిగా ఉంటే అమరావతి ఉండాలని, లేదంటే నెల్లూరు, ప్రకాశం జిల్లాలను రాయలసీమలో కలిపి కొత్తగా గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని లేదంటే కర్నూలు జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని జేసీ దివాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.