Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అది చాలా ట్రాఫిక్‌తో కూడుకున్న రోడ్డు. అదీ దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో అత్యంత రద్దీగా ఉండే మెరైన్ డ్రైవ్ రోడ్డు మీద ఓ జంట చేసిన పనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకు ఆ జంట చేసిన పని ఏమిటో తెలుసా? నడిరోడ్డుపై, అది కూడా నగరంలోనే డివైడర్ మీద శృంగార కార్యకలాపాల్లో మునిగిపోయారు. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే సెక్స్‌లో పాల్గొన్నారు. ఇంతమంది ఉన్నారన్న ఇంగితం లేకుండా శృంగారం మొదలెట్టేసింది ఆ జంట.
అటుగా వెళ్లే వారంతా ఈ దృశ్యాలన్ని ఫోటోలు, వీడియో తీశారు. అవి కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిపోయాయి. ఈలోపు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడి పోలీసులు రావడం గమనించిన ఆ జంట హడావిడిగా బట్టలు సరిచేసుకుని, అక్కడి నుంచి ఉడాయించారు. వెంబడించిన పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న యువకుడిని విదేశీయుడిగా గుర్తించారు. యువకుడు రష్యా నుంచి వచ్చినట్టు గుర్తించి అతడి కోసం లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న యువతి పరస్పర విరుద్ధంగా మాట్లాడుతుండడంతో ఆమె మానసిక స్థితి సరిగా లేనట్టు గుర్తించారు. ఓసారి తాము గోవా నుంచి వచ్చామని, మరోసారి రష్యా అని, జెనీవా అని చెబుతున్నప్పటికీ ఆహార్యాన్ని బట్టి ఆమె భారతీయురాలేనని పోలీసులు పేర్కొన్నారు. యువతిని చెంబూరులోని మహిళా సురక్షా కేంద్రానికి తరలించినట్టు తెలిపారు.