వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రెండో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన తల్లి విజయమ్మ ఉద్వేగాన్ని పట్టలేక పోయింది. జగన్‌ను దగ్గరకు తీసుకుని తన హృదయానికి హత్తుకున్న ఆ తల్లి రాల్చిన ఆనంద భాష్పాలను కుమారుడు జగన్ తన చేత్తో తుడిచి ఓదార్చాడు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారంలో ఆయన కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల, కూతుర్లు హర్ష, వర్ష ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జగన్ ప్రసంగం తర్వాత ఆయన తల్లి విజయమ్మ భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె ఆనందపాష్పాలు పెట్టుకుని జగన్ ను హత్తుకున్నారు. కుమారుడిని ముద్దాడి ఆనందాన్ని పంచుకున్నారు. జగన్ మాట్లాడుతున్నంతసేపు పట్టి ఉంచిన కన్నీటిని ఆపుకోలేని విజయమ్మ ఒక్కసారిగా జగన్ ను హత్తుకుని ఏడ్చేశారు. తల్లి కన్నీళ్లను చేతులతో తుడిచి అతిథులకు వీడ్కోలు చేబుదామంటూ జగన్ ఆమెను తోడ్కొని వెళ్లారు. ఈ సన్నివేశంతో సభలో ఒక్కసారి అందరి గుండెలు బరువెక్కాయి.