కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఒక భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ మూవీ పై ఇప్పటికే ఎన్నో పుకార్లు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ సెట్ వేస్తున్నారని కూడా తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ లోని విజువల్స్ వండర్ ఫుల్ గా ఉంటాయని, ముఖ్యంగా ప్రభాస్ గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని తెలుస్తోంది.

ఈ సీక్వెన్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తుంది . మరి ఈ మూవీ లో ప్రభాస్ ఫ్యాన్స్ కోసం మారుతి ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి. మొత్తానికి ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందనుంది. అలాగే ఇదొక మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అని, ఈ మూవీ లో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాదంట . ప్రభాస్ కి పూర్తిగా ఇది కొత్త జోనర్ అవుతుందట. కాగా ప్రభాస్ తో మారుతి సినిమా చేస్తే.. ఇక మారుతి రేంజ్ మారిపోయినట్టే.






